![]() |
![]() |
.webp)
గీతూ రాయల్ గురించి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అన్ని సీజన్స్ లోకి సీజన్ 6 గురించి ఆలోచిస్తే మాత్రం మొదట గుర్తొచ్చే కంటెస్టెంట్ గీతూ..అలాంటి గీతూ బిగ్ బాస్ హౌస్ ని వదల్లేక వదిలి వచ్చింది. ఐతే గీతూ రాయల్ ఒక యూట్యూబర్..తన ఛానల్ లో ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. మోటివేషనల్ వీడియోస్ తో ఎక్కువగా పాపులర్ అయ్యింది. అలాంటి గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఆమెను ఒక సమస్య వెంటాడుతోందట. ఆ విషయం చెప్తూ చాలా బాధపడుతోంది. "నాకుండే చాలా ప్రాబ్లమ్స్ లో ఒక కొత్త ప్రాబ్లమ్ తయారయ్యింది. నిజం చెప్పాలంటే నాలుగు నెలల నుంచి ఈ ప్రాబ్లమ్ నన్ను హాంట్ చేస్తోంది. ఒకప్పుడు నేను మోటివేషనల్ వీడియోస్ చేసేటప్పుడు జనాలకు నా రియాలిటీ తెలీదు.
ఆ తర్వాత నేను బిగ్ బాస్ లోకి వెళ్ళాక నా రియాలిటీ ఎప్పుడైతే జనాలకు అర్దమయ్యిందో...నాకంటూ టు సెట్స్ ఆఫ్ పీపుల్ తయారయ్యారు. ఒక వర్గం ఫాన్స్ కి నేను ఎలా ఉన్నానో అలాగే ఇష్టం...మరో వర్గం ఫాన్స్ మాత్రం నన్ను హేట్ చేస్తూ ఉన్నారు. నేనంటే ఇష్టపడిన వాళ్ళ కోసం నేను ఇట్లనే ఉండాలా...లేదంటే నన్ను హేట్ చేసేవాళ్ల కోసం నేను మారాలా ...లేదా నేను ఏదన్నా మార్చుకోవాలా..అని చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను. నా ప్రాబ్లమ్ కి ఎవరు ఆన్సర్ ఇస్తారో ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందో" అంటూ తన బాధను వీడియో రూపంలో చేసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. మరి ఆమె సమస్య ఎప్పటికి తీరుతుందో తెలీదు. గీతూ రాయల్ బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసి కొన్నాళ్ళు అమెజాన్లో పని చేసింది. కానీ ఆ జాబ్ నచ్చక వదిలేసింది. తర్వాత బిగ్ బాస్ వీడియోలకు రివ్యూలు చెబుతూ బాగా పాపులర్ అయ్యింది.
![]() |
![]() |